![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -270 లో....వీరుకి బుద్ది చెప్పాలని గంగ, రంగా కలిసి ప్లాన్ చేస్తారు. వీరుని పడిపోయేలా చేసి ఒకసారి శకుంతల పెద్దసారు ముందుపడేలా చేస్తారు.. మరొకసారి రుద్ర కాళ్ళ ముందు పడేలా చేస్తారు. ఏంటి అన్నయ్య ఈ రోజు ఇలా పడిపోతున్నావ్.. అద్దాలు మార్చుకోమని గంగ వెటకారంగా మాట్లాడుతుంది. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో దిష్టి తియ్ ప్రీతీ అని శకుంతల చెప్తుంది. వీరు దగ్గరికి ప్రీతీ వస్తుంది. ఏంటి అండి మీరు రుద్ర అన్నయ్యకి నచ్చని పని ఏదైనా చేస్తున్నారా అని అడుగుతుంది.
లేదు ఎందుకలా అడిగావని వీరు అంటాడు. నాకు అనిపించింది.. మీరు ఒకవేళ తనకి నచ్చని పని చేయకండి.. నీకు భర్త ఎక్కువ అన్నయ్య ఎక్కువ అంటే నేను అన్నయ్య అనే చెప్తానని ప్రీతీ అంటుంది. నీకే కాదు ఇంట్లో అందరికి ఆ రుద్ర అంటే నచ్చకుండా చేస్తానని వీరు అనుకుంటాడు. ఆ తర్వాత ప్లాన్ సక్సెస్ అని గంగ, రంగా మాట్లాడుకుంటారు. అప్పుడే రుద్ర వస్తాడు. ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేసారని రుద్ర కోప్పడుతాడు. నా భర్తని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని గంగ అంటుంది. ఈ దారంతో కట్టారు.. ఇది ఎంత డేంజర్ తెలుసా ఒక పనిచేసే ముందు ఆలోచించాలని గంగపై రుద్ర కోప్పడతాడు. దాంతో గంగ అలిగివెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వే వస్తావ్ పోమని రుద్ర అంటాడు.
ఆ తర్వాత గంగ అలిగి సుధా ఇంటికి వెళ్తుంది. అక్కడ భోజనం చేస్తుంది. ఇది తిను.. అది తిను అంటూ సుధా వేస్తుంది. అమ్మ మీరు మీ అల్లుడిని అడగండి.. నాపై ఎందుకు కోప్పడ్డారోనని గంగ అంటుంది. అప్పుడే రంగా వస్తాడు. నువ్వు ఏదో బాధపడుతూ కుర్చున్నావనుకుంటే ఫుల్ గా తినేస్తున్నావా అని రంగా అంటాడు. మరి కడుపు మడ్చుకోవాలో అని గంగ అంటుంది. నీ కోసం బావ వచ్చాడు బయట వెయిట్ చేస్తున్నాడని రంగా చెప్తాడు. లోపలికి రమ్మను అని సుధా చెప్తుంది. రంగా వెళ్లి రుద్రని తీసుకొని లోపలికి వస్తాడు. ఎందుకు రుద్ర గంగపై కోప్పడ్డావని సుధా అడుగుతుంది. ఇలా ప్లాన్ చేసిందా అని రుద్ర అంటాడు. ఎక్స్ ట్రాలు చాలు గాని రా అని రుద్ర అనగానే నన్ను బుజ్జగించి తీసుకొని వెళ్ళమని గంగ అంటుంది. ఇక సుధా బుజ్జగించమని చెప్పగానే గంగని రుద్ర బుజ్జగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |